
జనం న్యూస్, నవంబర్ 04,అచ్యుతాపురం:
జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాల్లో భాగంగా చెకుముకి టాలెంట్ టెస్ట్ మండల స్థాయి పరీక్షలు అచ్యుతాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు.ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాల నుంచి 45 మంది విద్యార్థులు పాల్గొన్నారు.ఈ పోటీల్లో ప్రైవేట్ విద్యాసంస్థల నుంచి శ్రీ భవాని విద్యా నికేతన్, కైట్స్ విద్యా విహార్ విద్యార్థులు ప్రభుత్వ స్కూల్ నుంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎం జె పురం, కస్తూరిబా బాలికల విద్యాలయం విద్యార్థునులు జిల్లా స్థాయికి ఎంపికైనట్టు జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం పద్మావతి, జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు మారిశెట్టి వెంకట అప్పారావు, ఉప్పాడ రాము, బొడ్డెడ రామ్ కుమార్ ఉపాధ్యాయురాళ్లు సుధ, శశికళ, మారిశెట్టి కృష్ణకుమారి, ఆళ్ల రూప తదితరులు పాల్గొన్నారు.