
జనం న్యూస్, నవంబర్ 4, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ )
సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన సిద్దిపేట టౌన్ కు చెందిన లింగవ్వ, ర్యాకం మహేష్, దబ్బేట భగవాన్,
బహుజన లెఫ్ట్ పార్టీ-లోకి ఆహ్వానించినట్లు గా బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కోటగిరి ఆంజనేయులు, బహుజన లెఫ్టు మహిళ సంఘం కన్వీనర్ కొండ వర్ష ,ఈరోజు సిద్ది పేట్ విలేకరులకు పంపిన పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈరోజు సిద్దిపేట బిఎల్పి పార్టీ కార్యాలయంలో పార్టీలో చేరిన వాళ్లకి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించన అనంతరం ఆయన మాట్లాడుతూ మార్క్సిజం- అంబేడ్కరిజం ఆలోచన విధానంతో కూడిన రాజకియ కార్యక్రమం ద్వారా తెలంగాణలో బహుజన శ్రామిక ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయ రాజ్యాధికారం లక్ష్యంగా పని చేస్తున్న బహుజన లెఫ్ట్ పార్టీ-(బహుజన కమ్యూనిస్టు)లోకి సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన లింగవ్వ, ర్యాకం మహేష్, దబ్బేట భగవాన్ బహుజన వామపక్ష ఉద్యమాల్లో పాల్గొన్న అనుభవం ఉన్న దృష్ట్యా ని బహుజన లెఫ్ట్ పార్టీలోకి ఆహ్వానించినట్లు ఆ పార్టీ బహుజన లెఫ్ట్ మహిళా సంఘం కన్వీనర్ వర్ష , ఆంజనేయులు తెలిపారు. సిద్దిపేట్ జిల్లాలో పార్టీ,ప్రజా సంఘాల బలోపేతానికి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దబ్బెట ఆనంద్, సన్నీ ,రాజు తదితరులు పాల్గొన్నారు