
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
ఆడపూరు అంబేద్కర్ గురుకు పాఠశాలలో ఉదయం తినే అల్పాహారం నీ స్కూల్ చైర్మన్ ఇరువురి మురళి పరిశీలించారు.విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత, శుభ్రత,వంటశాల నిర్వ హణపై సమగ్ర పరిశీలన జరిపి సిబ్బందికి సూచనలు ఇచ్చారు.విద్యార్థినులు భోజనంతో సంతృప్తిగా ఉన్నారో లేదో కూడా తెలుసుకున్నారు.స్కూల్ చైర్మన మురళి మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం కోసం పరిశుభ్రమైన,పోషకాహారంతో కూడిన భోజనం ఇవ్వడం ప్రతి స్కూల్ బాధ్యత అని తెలిపారు.భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమం పర్యవేక్షణ నిరంతరం కొనసాగుతుందని చెప్పారు.ముఖ్యంగా తల్లిదండ్రులు, ఉపాధ్యా యులు కూడా భోజన నాణ్యతపై దృష్టి పెట్టాలని చైర్మన్ సూచించారు.