
నూతన అధ్యక్షునిగా పరకాల విష్ణువర్ధన్ రెడ్డి
(జనం న్యూస్ చంటి నవంబర్ 4)
సిద్దిపేట పట్టణం, ఆదర్శనగర్ : ఆదర్శనగర్ స్నేహం అసోసియేషన్ వార్షిక సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సంఘానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నిక చేశారు. సభ్యుల సమక్షంలో సజావుగా ఎన్నికల ప్రక్రియ పూర్తయింది.సంఘ అధ్యక్షుడిగా పరకాల విష్ణువర్ధన్ రెడ్డి ఎన్నిక కాగా,ప్రధాన కార్యదర్శిగా బేతిగంటి
మధుసూదన్ గౌడ్, క్యాషియర్ గా అశోక్ గౌడ్, సలహాదారులు ఎల్లంకి భూపాల్ రెడ్డి కె.యాదగిరి పి. అంజి రెడ్డి
యం. ఎల్లయ్య ఎ. రవీందర్ రెడ్డి వి. రాజిరెడ్డి ఆడిట్ నెంబర్లు:-డి పరశురాములు సిహెచ్. రమేష్ సిహెచ్. అంజయ్య ఎంపిక చేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సభ్యులు మాట్లాడుతూ — “సంఘ అభివృద్ధి, సమాజ సేవకు ప్రాధాన్యం ఇస్తూ అన్ని కార్యక్రమాలను సమన్వయంగా నిర్వహిస్తాం” అని తెలిపారు. పాత కార్యవర్గం సభ్యులు కొత్త బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు, యువత, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం సభ్యులు స్నేహభోజనం నిర్వహించి సత్సంబంధాలను బలోపేతం చేసుకున్నారు.

ప్రధాన కార్యదర్శి బేతిగంటి మధుసూదన్ గౌడ్