
జనం న్యూస్ 05 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
పాఠశాల విద్యార్థులపై ఇంత నిర్లక్ష్యమా…260 మంది విద్యార్థులకు కేవలం ముగ్గురు టీచర్లు, ఒక డిప్యూటేషన్ టీచర్ మాత్రమే…సిలబస్ పూర్తికాక విద్యార్థులకు అవస్థలు.కలలుగని వాటిని సాధించుకోలేని పరిస్థితుల్లో విద్యార్థులు నడిగడ్డ హక్కుల పోరాట సమితి చొరవతో విద్యా వాలంటీర్ ఏర్పాటుకై హమీ.ఆరగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులతో మాట్లాడిన యన్ యచ్చ్ పి యస్ జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్.గట్టు: ఆసియా ఖండంలోనే అత్యంత వెనకబాటు తనానికి గురైన గట్టు మండలంపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. గట్టు మండలంలోని ఆరగిద్ద గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.*ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆరు నుండి పదవ తరగతి వరకు ఉన్న పాఠశాలలో 260 మంది విద్యార్థులకు గాను కేవలం ముగ్గురు టీచర్లు మరియు ఒక డిప్యూటేషన్ టీచర్ ఉన్నారని,తెలుగు,ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ సబ్జెక్టులను బోధించేందుకు ఉపాధ్యాయులు లేక విద్యా బోధన కుంటు పడిందని, త్వరలో రాబోయే రోజుల్లో పరీక్షలు రాసే సమయంలో విద్యార్థులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని తెలిపారు. విద్య హక్కు చట్టం ప్రకారం 9 మంది టీచర్లు ఉండాల్సిన పాఠశాలలో కేవలం ముగ్గురు మాత్రమే ఉండడాన్ని బట్టి చూస్తే విద్యా వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య ధోరణి తో ఉన్నదని, కనీసం రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేని దౌర్భాగ్యం ఏర్పడిందని అన్నారు.ఇప్పటిదాకా గత ప్రభుత్వాలు గట్టు మండలాన్ని దత్తత తీసుకుంటామని హామీలు ఇచ్చారే తప్పా ఇప్పటివరకు ఏ హామీలు కూడా అమలు కాలేదన్నారు.విద్యార్థులకు ఓటు హక్కు లేనందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారా లేక చదువుకుంటే చైతన్యమై పాలకులను ప్రశ్నిస్తారనే కోణంలో అన్యాయం చేస్తున్నారా? అని ధ్వజమెత్తారు.పేద విద్యార్థుల భవిష్యత్తుకై నడిగడ్డ హక్కుల పోరాట సమితి తరపున ఒక విద్యా వాలంటీర్ టీచర్ ను మా వంతు బాధ్యతగా నియమిస్తున్నామని పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి మరియు విద్యార్థులకు హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు, జిల్లా కార్యదర్శి లవన్న, జిల్లా నాయకులు రంగస్వామి, గట్టు మండల అధ్యక్షుడు బలరాం నాయుడు, మండల నాయకులు దయాకర్,ఆంజనేయులు, గోపాల్,బంగి పరుష, నాగేష్, సురేష్, అమరేష్, గొర్ల తిమ్మప్ప, ఆరగిద్ద గ్రామ కమిటీ నాయకులు హనుమంతు, నరసింహ,మల్దకల్ బి. నరసింహ, మల్దకంటి, వీరన్న,రామకృష్ణ,తాయప్ప, రామాంజనేయులు,రంగన్న, నల్లన్న తదితరులు పాల్గొన్నారు.