
జనం న్యూస్ 05 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
సిపిఐ పార్టీ విరాళాల సేకరణ కు కార్యకర్తలు సిద్ధం కావాలి.కేంద్రం బీజేపీ ప్రభుత్వ పాలన సామాన్య ప్రజలను మతాల పేరిట ఇబ్బందులకు గురి చేస్తున్నది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఏం బాల్ నరసింహ
సిపిఐ శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేద్దాం ప్రజా సమస్యలపైన నిరంతరం పోరాటాలు చేసే గొప్ప చరిత్ర కలిగిన పార్టీ భారత కమ్యునిస్టు పార్టీ( సి పి ఐ) అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఏం బాల్ నరసింహ పిలుపు నిచ్చారు. మంగళవారంనాడు సీపీఐ జిల్లా కమిటీ సమావేశం గద్వాల కేంద్రం లోని సిపిఐ పార్టీ జిల్లా కార్యాలయంలో రవి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ యెక్క సమావేశానికి బాల నరసింహ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఐ ఏర్పడి 100ఏండ్లు అవుతున్న సందర్బంగా ఖమ్మంలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ ను నిర్వహించడం జరుగుతుందని అలాగే రాష్టంలో మూడు ప్రచార జాతలు జరుగుతాయని అందులో ఒకటి గద్వాల జిల్లా నుండి ప్రారంభం అవుతుందన్నారు. ఇప్పటి వరకు సిపిఐ చేసినన్ని పోరాటాలు మరే పార్టీ దేశంలో చేయలేదని పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మతాల,కులాల పేరిట ప్రజలను మభ్యపెడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశ సమాన సమగ్ర అభివృద్దిని మరియు ప్రజల అవసరాలను, జీవితాలను గాలికొదిలేసి కేవలం మతం అంటూ కాలం గడుపుతున్నారన్నారు. దేశ పెట్టుబడిని దేశ విదేశీ ధనవంతుల చేతుల్లో పెట్టీ దేశ ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తుందనీ,కేవలం వారి రాజకీయ లబ్ది కోసం పేద ప్రజల జీవితాలను ఇబ్బందులకు గురిచేస్తుంది అన్నారు.ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. దాదాపు 142 కోట్లపైగా జనాభా ఉన్న భారతదేశం
పేద ప్రజల సమస్యలు తీరకుండా దేశం ఎట్లా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు.నేడు దేశం అభివృద్ధి చెందాలన్న , మరియు సామాన్య ప్రజల యొక్క సమస్యలు తీరాలన్న అది కేవలం పాలకుల విధానాలపై ఆధారపడి ఉందన్నారు. ఇది సాధ్యం కావాలంటే భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) అధికారం వలన మాత్రమే సాధ్యం అన్నారు.అంతకు ముందు సిపిఐ జిల్లా కార్యదర్శి బి .ఆంజనేయులు మాట్లాడుతూ సమావేశ ఎజెండాను, పార్టీ కార్యాచరణను వివరించారు.అలాగే ఈ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏర్పడి 100 సంవత్సరాల అయిందని, ఈ నెల 15 న ప్రారంభం అయ్యే ప్రచార జాతను అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనేలా చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.దీనివలన వివిధ మండలాల్లో, గ్రామాల్లో ఉన్న ప్రజలకు సిపిఐ పార్టీ గురించి తెలిసి పార్టీ బలోపేతం అవడానికి ఉపయోగపడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఆశన్న ,రంగన్న,రవి,ఉప్పేరు కృష్ణ ,సిద్ధప్ప ,కాసిం ,ఎ ఐ యస్ యాప్ మాజీ రాష్ట్ర నాయకులు రాము, ఎఐ వై యాప్ జిల్లా అధ్యక్షులు పరమేష్,సిపిఐ జిల్లా నాయకులు వెంకట్రాములు, రామాంజనేయులు, ఏఐఎస్ఎఫ్ ప్రవీణ్,వెంకటేష్,ప్రతాప్ తదితర నాయకులు పాల్గొన్నారు భారత కమ్యూనిస్ పార్టీ (సిపిఐ) జోగులాంబ గద్వాల జిల్లా