
జనం న్యూస్ నవంబర్ 05 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కుమురంభీం జిల్లా వాంకిడి మండల తహసీల్దార్ కార్యాలయంలో కమన గ్రామానికి చెందిన లోబడే విమల భర్త పెంటు వీరితో కలిసి తమకు జరిగిన అన్యాయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి వివాదంలో న్యాయం చేయాలని స్థానిక తహసీల్దారుని నిలదీశారు.బాధితులు మాట్లాడుతూ, తమ భూమిని అక్రమంగా వేరే వ్యక్తులకు పట్టా మంజూరు చేశారని, ఇది పూర్తిగా అన్యాయమని ఆరోపించారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో ముడుపులు చెల్లింపులు జరిగినట్లు వారు తెలిపారు. భూమి విషయాన్ని నిష్పాక్షికంగా విచారించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.విమలకు మద్దతుగా స్థానిక మాజీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మాజీ సర్పంచులు తదితరులు హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.