
జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 5
తర్లపాడు మండలం నందు రబీ సీజన్ కి పొలం పిలుస్తోంది కార్యక్రమం మొదలైందని తెలిపారు. మండలం లోని సీతనాగులవరo మరియు సూరేపల్లి గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు.రైతులకు అవసరమైన 25% రాయితీతో పప్పుశనగ జే జి 11 విత్తనాలు శుక్రవారం నుంచి పంపిణీ చేస్తామని తెలియజేశారు.రైతులకు కావలిసిన యూరియా,20-20-0-13 ఎరువులు రైతు సేవ కేంద్రాలలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.అనంతరం రైతులతో కలిసి కంది పొలాలను సందర్శించారు.కంది పంట కళ్ళెదశలో తప్పనిసరిగా వేపనూనెను పిచికారి చేయాలని తెలిపారు.వేపనూనె స్ప్రే చేయుటవలన పురుగులు ఆకులపై గుడ్లు పెట్టవు తద్వారా పురుగుల సంతతి తగ్గిపోతుంది.పురుగుమందుల తోపాటు వేపనూనెను కలుపుకొని పంటలపై పిచికారి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈఓ దేవేంద్ర గౌడ్, విఏఏ జిలానీ, రైతులు పాల్గొన్నారు.
