
సంగారెడ్డి జిల్లా జనం న్యూస్ ఇంచార్జ్ బి వీరేశం నవంబర్ 5
సంగారెడ్డి జిల్లా ప్రజలు రెవెన్యూ శాఖ అధికారుల పనితీరుతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణ పబ్లిక్ ప్రజల చిన్నచిన్న పనులు నెలల తరబడి పెండింగ్లో ఉంచి ప్రజలను కార్యాలయాల చుట్టూ తిరిగేలా చేస్తున్నారు. సర్టిఫికెట్లు, ఆదాయ ధృవపత్రాలు, కాస్త్రి సర్టిఫికెట్లు, మ్యూటేషన్ వంటి పనులు చేయించుకోవడానికి ప్రజలు అధికారులు వద్దకు పలుమార్లు వెళ్లినా సరైన స్పందన లేకుండా ఫైళ్ళు టేబుళ్లపై దుమ్ము పట్టేలా పెడుతున్నారు. పనులు పూర్తవ్వక ప్రజలు చెప్పులు అరిగిపోయేంతవరకు కార్యాలయాలు తిరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నిర్లక్ష్య వైఖరి వల్ల పేద ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి రెవెన్యూ శాఖలో అవినీతి, ఆలస్యాలను ఆపేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.