
డిసిసిబి మేనేజర్ దీపక్ కుమార్..
పాపన్నపేట, నవంబర్ 4. (జనంన్యూస్)
జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఆధ్వర్యంలో ఈనెల ఒకటి నుండి 30 వరకు డిపాజిట్ల సేకరణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు బ్యాంక్ మేనేజర్ దీపక్ కుమార్ వెల్లడించారు, మాస ఉత్సవాలలో భాగంగా ఆయన మండల కేంద్రమైన పాపన్నపేటలో మాట్లాడారు. ఇందులో భాగంగా స్వర్ణానిధి డిపాజిట్ పథకం చేపట్టినట్లు ఆయన తెలిపారు, ఈ పథకంలో భాగంగా 444 రోజులకు గాను అత్యధిక శాతం 7.75 శాతం వడ్డీ ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. సీనియర్ సిటిజన్లకు 8.25 శాతం వడ్డీ ఇస్తారని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన సూచించారు, తమ బ్యాంకులో లాకర్ సౌకర్యంతో పాటు గోల్డ్ లోన్ సౌకర్యం ఉందని ఆయన వెల్లడించారు.