
జనం న్యూస్ నవంబర్ 05
మితిమీరిన వేగమే ప్రమాదాలకు కారణమవుతుందని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కోదాడ ట్రాఫిక్ ఎస్సై అంజిరెడ్డి అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని లారీ ఆఫీస్ వద్ద డీసీఎం డ్రైవర్లకు రోడ్డు భద్రతా ప్రమాదాల నివారణ గురించి, అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనాలు నడిపేటప్పుడు వాహన డ్రైవర్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, వాహనాలు కండిషన్ లో ఉంచుకోవాలని, క్రాసింగ్ ఓవర్ టెక్ చేసే సమయంలో వెనక ముందు చూసుకుని వాహనాలను గమనించాలని వాహనదారులకు ఎస్సై సూచించారు. విశ్రాంతి లేకుండా,మద్యం సేవించి వాహనాలు నడపవద్దని వాహనదారులను హెచ్చరించారు.