
మార్కెట్ కమిటీ చైర్మన్ రాములు గౌడ్
జనం న్యూస్ 06నవంబర్ పెగడపల్లి
తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు గత పది రోజుల నుండి నేటి వరకు మండల కేంద్రంలో ఉన్న ఐకెపి ఫ్యాక్స్ వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని అదేవిధంగా గత సోమవారం నుండి మండల కేంద్రంలోని పిఎసిఎస్ వరి ధాన్య కొనుగోలు కేంద్రంలో తూకం వేస్తూ మిల్లర్లకు పంపించడం జరిగిందన్నారు.అలాగే మరో రెండు మూడు రోజుల్లో మిగతా కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తూకం వేయించడంజరుగుతుందన్నారు టిఆర్ఎస్ నాయకులు మాట్లాడే ముందు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం నాయకులు గాని ప్రభుత్వ అధికారులు గాని గత ప్రభుత్వంలో ఐకెపి మరియు పిఎసిఎస్ సెంటర్లను సందర్శించిన దాఖలాలు లేవని అన్నారు అలాగే టిఆర్ఎస్ పాలనలో తప్ప తాలూ పేరుతో క్వింటాల్‌కు ఐదు నుంచి పది కిలోలు కటింగ్ చేస్తూ రైతుల శ్రమను దోచుకొని కోట్ల రూపాయలను దండుకొని జేబులోరింపుకున్న టిఆర్ఎస్ నాయకులు రైతుల క్షేమం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు.అలాగే మంత్రివర్యులు రైతులను పట్టించుకోవడంలేదని జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఉన్న ప్రేమ రైతులపై లేదని అనడం సరికాదని అన్నారు గత ప్రభుత్వంలో పనిచేసిన మంత్రివర్యులు ఈశ్వర్ గతంలో బతికపల్లి కివచ్చినప్పుడు కొంతమంది రైతులు అతన్ని కలిసి వరి ధాన్యం కొనుగోలు సరిగా చేయడం లేదనిఐదు నుండి పది కిలోలు కటింగ్ చేసిరైతులకు అన్యాయం చేస్తున్నారనిఅడిగినందుకురైతులను మీ ఇష్టం ఉన్న కాడ ధాన్యాన్ని అమ్ముకొమ్మని గవర్నమెంట్ పూర్తిగా ధాన్యం కొనాలని రూలేమీ లేదని ఎద్దేవ చేశారని అన్నారు.ఇప్పటి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజా ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధితో పని చేస్తూ అవసరం ఉన్నప్పుడల్లా అధికారులను పర్యవేక్షించేలా చర్యలు చేపట్టిందన్నారు.తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో పని చేస్తున్న మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ ఇప్పుడు ఉన్న ఎలక్షన్లో ప్రచారం నిర్వహిస్తూ కూడారోజు అధికారులకు నాయకులకు ఫోన్ల ద్వారా మాట్లాడి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రివర్యులు ఆదేశించారని తెలియజేశారు మంత్రి ఆదేశానుసారం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తడిసిన వరి ధాన్యాన్ని కూడా మద్దతు ధరకు సేకరిస్తామని వివరించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సురకంటి సత్తిరెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు వోరగల శ్రీనివాస్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు చెట్ల కిషన్ విజయభాస్కర్ మండల నాయకులు తడగొండ రాజు పూసాల తిరుపతి ఎల్లకొండ కృష్ణ హరి బొడ్డు రమేష్ ముంజ మహిపాల్ గౌడ్ పలువురు నాయకులు పాల్గొన్నారు.