
రామునిబండ జాతరకు పోటెత్తిన భక్తులు..
జనం న్యూస్, నవంబర్ 5,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ )
జగదేవ్పూర్ మండలం లోని జంగం రెడ్డిపల్లి గ్రామ సమీపంలోని రాముని బండ శ్రీసీతారాముని ఆలయంలో కార్తీక పౌర్ణమి ఉత్సవాలు బుధవారం శ్రీ రాముని బండ జాతర ఘనంగా జరిగాయి. ఈ జాతరకు వేలాది మంది భక్తులు వచ్చారు. కోరిన కోరికలు తీర్చే స్వామిగా భక్తుల మధ్యలో కొలువైన సీతారామ చంద్ర స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రతిఏటా కార్తిక పౌర్ణమి రోజు నుండి రెండు రోజులపాటు ఘనంగా స్వామి వారి జాతర ఉత్సవాలు జరుగుతాయి. ఉదయం ఆలయ నిర్వాహకులు జగన్ని వాస చారి ఆలయ నిర్వాహకులు రవీం దర్ రెడ్డి గ్రామ మాజీ సర్పంచ్ కుమార్ ఆధ్వర్యంలో జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుండి భక్తులు వేలాదిగా తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.బుధవారం ఉదయం నుంచి 5 గంటల వరకు భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. గుండంలో స్నానం చేస్తే సర్వ రోగాలు న్యాయమవుతాయని భక్తుల నమ్మకంతో గుండంలో నీళ్ల కోసం భక్తులు పోటుపడుతూ బకెట్ల సహాయం తో స్నానాలు చేశారు. అలాగే మహిళలు దీపారాధన చేశారు. కోరిన కోర్కెలు తీర్చాలని స్వామివారికి మొక్కలు చెల్లించుకున్నారు. అలాగే మొక్కులు తీర్చుకున్న భక్తులు సత్యనారాయణ వ్రతాలు చేసుకుని స్వామివారికి మొక్కలు చెల్లించారు.ఆలయం వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటన జరగకుండా జగదేవ్పూర్ పోలీసులు బందోబస్తు చేపట్టారు. అలాగే కొండపోచమ్మ అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు.

