
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా
నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామం ఎర్ర చెరువు కట్టపై వెలసిన శివాలయంలో ఈరోజు ఉదయం నాలుగు గంటల నుండి కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు శివునికి పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త నాగేంద్ర గుడి పూజారి గిరి స్వామి మాట్లాడుతూ ఇక్కడ 101 శివలింగాలు ఉన్నాయి అలాగే ప్రశాంత వంతమైన వాతావరణం ఉంటుంది ఈ శివాలయం నిర్మాణం చివరి దశలో ఉన్నది కావున ఎవరైనా దాతలు ముందుకు వస్తే ఈ గుడి నిర్మాణం ఇంకా బాగా అభివృద్ధి చేసుకోవచ్చు అని అన్నారు ఇందులో భాగంగా అనిల్ సునీల్ సూరి బాబు టీంకు చంద్ర శివ పాల్గొన్నారు
