
కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం కుండలేశ్వరం లోని శ్రీ పార్వతి సమేత కుండలేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధి లో టిడిపి సీనియర్ నాయకుడు పి ఎస్ ఎన్ రాజు (విలేఖరి రాజు ) గారి తల్లి క్రీ.శే
పత్సమట్ల సత్యవతి గారి జ్ఞాపకార్థం ఉచిత అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి నాగిడి నాగేశ్వరరావు, టి నాగు, టి శ్రీను, గంగుమళ్ళ భద్రరావు, వాసంశెట్టి రాజేశ్వరరావు, విత్తనాల బుజ్జి, జంగా శ్రీనివాస్, బండారు ఏసు, ఎస్ వి ఎస్ రవి వర్మ, సి. హెచ్ కృష్ణంరాజు పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.