
జనం న్యూస్ నవంబర్ 05
శివపార్వతులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక పౌర్ణమిని మునగాల మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో భక్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయం నుంచి ఉపవాస దీక్షను చేపట్టి, పుణ్యస్నానాలు ఆచరించి ఆలయాలకు బారులుతీరారు.దీంతో మండల వ్యాప్తంగా ఆలయాల్లో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని భక్తులతో సందడి నెలకొంది. దీపాలంకరణతో ఆలయాలను ముస్తాబు చేయగా, ఆ ఆలయాలకు తరలివచ్చిన భక్తులు దీపాలు పేర్చి, శివపార్వతులను భక్తిశ్రద్ధలతో పూజించారు.