
శానార్తి తెలంగాణ. 06నిజామాబాదు.ప్రతినిధి.
శ్రీమన్నింబాచల క్షేత్రం జనసంద్రమైంది. వేలాది మంది భక్తుల “గోవిందా… గోవిందా…” నామస్మరణలతో లింబాద్రి గుట్ట ప్రాంతం ఆధ్యాత్మికోత్సాహంతో పులకించింది. పవిత్ర లింబాద్రి గుట్టపై అంగరంగ వైభవంగా నిర్వహించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ..కార్తీకమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ రథోత్సవాన్ని ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు నంబి పార్థసారథి, నంబి విజయసారథి, నంబి వాసుదేవాచార్యులు ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల నడుమ ఘనంగా నిర్వహించారు అని అన్నారు.లింబాద్రి గుట్ట తెలంగాణ ఆధ్యాత్మిక స్ఫూర్తికి ప్రతీక. ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో జరిగే ఈ బ్రహ్మోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తున్నాయి. భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం సమగ్ర ఏర్పాట్లు చేయడం అభినందనీయం. ఈ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాము” అన్నారు.ఈ కార్యక్రమానికి నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి హాజరై స్వామి వారిని దర్శించుకొని ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది .ఈ కార్యక్రమంలో భక్తులు బిజెపి సీనియర్ నాయకులు పెద్దల్లా గంగారెడ్డి , బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ బిజెపి నాయకులు ఇల్లందుల ప్రభాకర్, మఠం పవన్, పవన్ ముందడ, సుగంధం హరీష్,రేణికింది హరీష్ నాయకులు కార్యకర్తలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
