
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ నవంబర్ 6జహీరాబాద్ నియోజకవర్గంలో
ఉన్న వివిధ కంపెనీలన్నీ లోకల్ యూత్‌కి ఉద్యోగాలు ఇవ్వకుండా నార్త్ ఇండియన్ కార్మికులను మాత్రమే నియమించుకోవడం వల్ల స్థానిక యువత నిరుద్యోగంతో సతమతమవుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, అన్ని కంపెనీల్లో కనీసం 80 శాతం ఉద్యోగాలు లోకల్ వారికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఈ కంపెనీలన్నీ మూసివేసి ప్రభుత్వం నిమ్స్ పరిశ్రమలను ఏర్పాటు చేస్తే లోకల్ ప్రజలకు స్థిరమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన తెలిపారు.