
నేడు తెలంగాణలో 90% ప్రజలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు.. విద్య లేదు, ఉపాధి లేదు, భూమి లేదు, వైద్యం లేదు, రాజ్యం లేదు. ఉన్నదల్లా అంతులేని దుఃఖం, మరణాలు, మనాదులూ. ఈ బాధలు, యుగాలుగా సాగుతూ వస్తూ…వుంది. దీనికి కారణం అగ్రకుల “రెడ్డి, రావు, కరణం, కమ్మ, కాపుల భూస్వామ్య వ్యవస్థ ". వీళ్ళ క్రిందనే మన తరాలన్నీ నలిగిపోయి, కాలిపోయి, మన జీవితాలన్నీ అంతమైపోయాయి. భారత రాజ్యాంగం, స్వాతంత్య్రం వచ్చినా తిరిగి మళ్ళీ అదే పాత అగ్రకుల భూస్వామ్య దొరలంతా.. అన్ని పార్టీలలో చేరి మనపై ఆధిపత్యం, దోపిడీ కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ దొరలే కాంగ్రెస్, ఆ దొరలే కమ్యూనిస్టులు, ఆ దొరలే తెలంగాణ ఉద్యమ కారులు, ఆ దొరలే అన్నీ..! వీరిలో ఏ ఒక్కడు మన బీసీ, ఎస్సీ, ఎస్టీల హక్కుల కోసం, అధికారం కోసం, మన బాగు కోసం పోరాడలేదు. మరి అలాంటప్పుడు మనం ఎట్లా బ్రతకాలి, మన బిడ్డల్ని ఎట్లా పోషించుకోవాలి, ఆ బిడ్డల భవిష్యత్తు ఏమిటి? ఇంత భయంకరమైన దోపిడి తెలంగాణ అంతటా నిరాటంకంగా సాగుతుంది.. ఇది నల్గొండ జిల్లాలో ఇంకా అతి భయంకరంగా సాగుతుంది.. ఈ అన్యాయాన్ని ఎదిరించి మనం గొప్పగా బతకాలంటే.. మన 90% ప్రజలం సంఘటితమై హక్కులు, అధికారం సంపాదించాలి. అందుకోసమే మనం బీసీ, ఎస్సీ, ఎస్టీ JAC అనే సంఘం కట్టుకున్నాం.. ఆ జేఏసీ సంఘం ఇయ్యాల తెలంగాణ లో ఊరు, వాడ, పట్టణం జిల్లాల అంతటా మన జనాన్ని జాగృతం చేస్తుంది,. అందులో భాగంగానే మన నల్గొండ పట్టణంలో పెద్ద జిల్లా స్థాయి సభ 09-11-2025..తారీఖున పెట్టబోతున్నాం. ఈ మీటింగ్‌కి అందరూ తప్పకుండ రావాలి.. మన బ్రతుకుని మనమే మార్చుకోవాలి అని పిలుపుని ఇచ్చారు ఈ కార్యక్రమంలో దేవరకొండ నియోజక వర్గ ఇంచార్జ్ వెంకటేశ్వర్లు మండల నాయకులు దశరథ్ గారు బీసీ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది