
జనంన్యూస్. 06. సిరికొండ.
సిరికొండ మండలంలో జిల్లా వ్యవసాయ అధికారి మేకల గోవింద్ వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించడం జరిగింది. రైతులు వరి ధాన్యాన్ని 17 అంతకన్నా తక్కువ శాతం వచ్చేవరకు వడ్లను ఆరబెట్టుకొని తాలుశాతం తక్కువ ఉండడానికి చెన్ని పట్టి వరి కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను బట్టి రైతులు టార్పాలిన్ అందుబాటులో ఉంచుకొని వడ్లు తడవకుండా కప్పుకోవాలని చెప్పారు. సిరికొండ మండలంలో అధికంగా వరి పంట సాగు చేయడం జరుగుతుంది. వరి పంట కు బదులుగా ప్రత్యామ్నాయంగా ఆరతడి పంటలైన మొక్కజొన్న జొన్న పంటలకు గాని మరియు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్న ఆయిల్ ఫామ్ పంట వైపు మొగ్గు చూపాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సిరికొండ తాసిల్దార్ రవీందర్ . MAO నర్సయ్య. ఏఈఓ మోహన్ మరియు రైతులు పాల్గొన్నారు