
జనం న్యూస్ నవంబర్ 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరులో ముందు ఉండాలని ఉద్దేశంతోనే ఎమ్మెల్సీ మధుసూదనాచారి ప్రజా ప్రభుత్వంపై అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. ఈ మేరకు మండలం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మండలం అధ్యక్షులు బుచ్చిరెడ్డి మాట్లాడుతూ అకాల వర్షాలకు ముంపు బాధితులను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించింది వారికి కనబడలేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఏనాడైనా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించారా. ప్రశ్నించారు బాధితులను మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యక్షంగా పరామర్శించిన దాఖలాలు ఉందా ఏకకాలంలో పెద్ద మొత్తంలో రైతులకు లక్షలలో రుణమాఫీ చేసిన పరిస్థితి ఉందా…? వీటికి ఎమ్మెల్సీ మధుసూదనాచారి సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధికోసం రైతులను వాడుకోవద్దని సూచించారు. వ్యవసాయ అధికారులు సర్వే చేస్తున్నారని, నష్టపోయిన ప్రతి ఎకరానికి నష్టపరిహారం అందిస్తామని రైతులు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. 2018 ఎన్నికలలో భూపాలపల్లిలో ప్రజా నిర్ణయంలో మూడో స్థానానికి పడిపోయిన మధుసూదనాచారి ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న సీఎం రేవంత్ రెడ్డి పై విమర్శలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి కౌంట్ డౌన్ ఎప్పుడో స్టార్ట్ అయిందని అతి తక్కువ సమయంలో ఆ పార్టీ కనుమరుగు అవుతుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ రుణమాఫీ, బోనస్ ఇస్తున్నది కనపడకపోవడం విడ్డూరమన్నారు. స్వలాభం కోసం విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మారపల్లి రవీందర్, దుబాసి కృష్ణమూర్తి, నిమ్మల రమేష్, ఆకుతోట సమ్మిరెడ్డి, చిందం రవి, మారపల్లి వరదరాజు, బసాని మార్కండేయ వడ్డేపల్లి శ్రీనివాస్, వలపదాసు వెంకటరమణ వీరన్న, చిరంజీవి, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు…..