
జనం న్యూస్ 07 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
ఇటీవల తుఫాన్ ధాటికి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, రైతులకు భీమా చెల్లించకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారని జెడ్.పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. జెడ్.పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి, గోనె సంచులను సప్లై చేయాలని అధికారులను కోరారు. వైయస్ జగన్ ప్రారంభించిన మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని డిమాండ్ చేశారు.