
విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్
జనం న్యూస్ 07 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీసు స్టేషను పరిధిలో సైబరు మోసంకు గురైన కేసులో నేరంకు పాల్పడిన నలుగురు ప్రధాన నిందితులను బొబ్బిలి పోలీసులు అరెస్టు చేసినట్లుగా గజపతినగరం పోలీసు స్టేషనులో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ నవంబరు 6న వెల్లడించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ - బొబ్బిలి పట్టణంకు చెందిన చింత
రమణ అనే ప్రభుత్వ టీచరుకు తే. 15-09-2025 దిన సి.బి.ఐ. నుండి మాట్లాడతున్నామని సైబరు నేరగాళ్ళు ఆన్లైనులో వాట్సాప్ కాల్ చేసి, మానవ అక్రమ రవాణకు పాల్పడినట్లుగా, ఆధార్ కార్డును దుర్వినియోగం చేసినందుకుగాను కేసు నమోదైనట్లు, డిజిటల్ అరెస్టు చేస్తున్నట్లుగా బెదిరింపులకు పాల్పడి, దఫదఫాలుగా రూ.22,18,000/- లను కాజేసినట్లుగా బొబ్బిలి పోలీసులకు ఫిర్యాదు చేయగా, బొబ్బిలి పోలీసులు తే. 09-10-2025 దిన కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసారని జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ తెలిపారు.ఈ కేసులో సైబరు మోసంకు పాల్పడినట్లుగా చెన్నైకు చెందిన (ఎ-1) సునీల్ సుతార్ (23 సం.లు) (ఎ-2) సతీష్ (19 సం.లు) (ఎ-3) రాజేష్ పాల్ (26 సం.లు) (ఎ-4) డి.మహ్మద్ ఇర్ఫాన్ (21 సం.లు) అనే నలుగురు నిందితలను అరెస్టు చేసినట్లుగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. ఈ కేసులో అరెస్టు కాబడిన నలుగురు నిందితులు మరో ప్రధాన నిందితుడు అయిన రాజస్థాన్‌కు చెందిన వినోద్ చౌదరితో కలసి బెదిరింపులకు పాల్పడినట్లుగా విచారణలో వెల్లడయ్యిందన్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వినోద్ చౌదరిని అరెస్టు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని, అతడిని కూడా త్వరలో అరెస్టు చేస్తామన్నారు. ఈ కేసులో ఫిర్యాది పోగొట్టుకున్న నగదు నిందితులకు చెందిన వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ అయినట్లుగా గుర్తించామని, ఈ నగదును ఫ్రీజ్ చేస్తున్నామని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. ప్రజలు సైబరు మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబరు నేరగాళ్ళు ఫోనులు చేసి మనం పంపిన ఒక పార్సిల్ మాదక ద్రవ్యాలున్నాయని, బయట ప్రాంతాల్లో చదువుకుంటున్న లేదా ఉద్యోగాలు చేస్తున్న పిల్లలు క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్నారని, పెద్ద మొత్తంలో లాటరీ గెలుచుకున్నామని, డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరింపులకు పాల్పడతారని, సిబిఐ లేదా పోలీసు అధికారులు, న్యాయమూర్తుల వేషాల్లో అన్‌లైనులో వీడియో కాల్స్ చేసి, చివరకు మనకు సహాయపడుతున్నట్లుగా నమ్మించి పెద్ద మొత్తంలో నగదును వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకుంటారన్నారు. ఈ కేసులో రూ.22,00,000 లను ఫ్రీజ్ చేశామన్నారు. ఇటువంటి నేరస్థులు ఎవరికైనా ఫోను చేసినట్లయితే వెంటనే సమాచారాన్ని స్థానిక పోలీసులకు లేదా 1930కు అందించాలని ప్రజలకు జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేసారు.ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసిన బొబ్బిలి డిఎస్పీ జి.భవ్యరెడ్డి, బొబ్బిలి సిఐ కే.సతీష్ కుమార్ మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అభినందించారు.