
వీరేశం సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ జనం న్యూస్ 07
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని మహీంద్రా కాలనిలో గల శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి దుండగులు ఆలయంలో ప్రవేశించి బంగారం, వెండితో పాటు హుండీలలో భక్తులు సమర్పించిన నగదును దొంగలించారు. అక్కడి నుండి పరారు కావాలనుకున్న దుండగులు బీట్ నిర్వహిస్తున్న పోలీసులను గమనించి నగదు, నగలు వదిలి పారిపోయారు. గురువారం పోలీసులు ఆలయాన్ని సందర్శించారు. క్లూస్ టీమ్ రంగప్రవేశం చేసింది. ఆలయ అధ్యక్షులు నర్సింహా రెడ్డి మాట్లాడుతూ దుండగులు దోచుకున్న నగదు, సొమ్మును పోలీసులను చూసి వదిలి పారిపోయారని, ఎలాంటి నష్టం జరగలేదని చెప్పారు. ఇక ముందు ఇలా జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు జహీరాబాద్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.