
బిచ్కుంద నవంబర్ 7 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో శుక్రవారం సివిల్ సప్లై ట్రాస్క్ పోర్ట్ టీం 3హైదరాబాద్ వారు బిచ్కుంద కస్తూర్బా గాంధీ హాస్టల్లో మరియు ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్, బీసీ బాల బాలికల, మరియు ఎస్సీ బాల బాలికల హాస్టల్లో, అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టిక ఆహారాన్ని విద్యార్థులకు సరిగా అందించాలని పేర్కొన్నారు, ట్రాస్క్ ఫోర్స్ టీం వారు హాస్టల్లో వంటగది మరుగుదొడ్లు విద్యార్థులు పడుకునే గదులు శుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు సూచించారు విద్యార్థులకు ఏ విధమైన సమస్యలు రాకుండా ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు ఇట్టి కార్యక్రమంలో ఓ ఎస్ డి శ్రీధర్ రెడ్డి, ఏ సి ఎస్ ఓ సుదర్శన్ రెడ్డి ,సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, మహమ్మద్ ఖలీద్ డిప్యూటీ తాసిల్దార్ సివిల్ సప్లై బిచ్కుంద, సురేష్ డిప్యూటీ తాసిల్దార్ సివిల్ సప్లై ఎల్లారెడ్డి పాల్గొన్నారు

