
జనం న్యూస్, నవంబర్ 07, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి :
పట్టణంలోని శ్రీ శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న అర్చన అను మహిళకి అత్యవసర చికిత్స నిమిత్తం బి పాజిటివ్ రక్తం అవసరం అని పేషెంట్ కుటుంబ సభ్యులు డోనర్ కోసం వెతుకుతూ రక్తదాతల అనుసంధాన కర్త ఎనుగందుల ఉదయ్ కుమార్ ని సంప్రదించగా మెట్రో ఫ్యాషన్ (మెట్ పల్లి) యజమాని, అక్టీవ్ డోనర్, భోగ నరేష్ కి సమాచారం తెలుపగా నరేష్ వెంటనే స్పందించి బ్లడ్ బ్యాంక్ కి వెళ్లి రక్తం ఇవ్వడం జరిగింది.నరేష్ ప్రతి 3 నెలలకి ఒకసారి రక్తదానం చేస్తూ ఏ సమయంలో అయిన ఎక్కడ అయిన ఫోన్ చేసిన వెంటనే రక్తం, ప్లేట్లెట్స్ దానం చేస్తూ ఉంటారు.అత్యవసర సమయంలో రక్తదానం చేసిన భోగ నరేష్ ని బ్లడ్ బ్యాంక్ సిబ్బంది మరియు శ్రీ శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డా౹౹ రవి, రక్తదాతల అనుసంధాన కర్త ఉదయ్ కుమార్, యువజన సంఘాల సభ్యులు, పేషెంట్ బంధువులు, స్నేహితులు అభినందించారు.