
జనంన్యూస్ నవంబర్ 7 మేడ్చల్ మల్కాజిగిరి
ఈసీ ఐ ఎల్ నుండి బండ్లగూడ వైపు నడిపించే రాజరాజేశ్వర ఆటో యూనియన్ లో జరిగినటువంటి అధ్యక్ష ఎన్నికలలో యూనియన్ సభ్యులు మంచికి మారు పేరుగా నిలుస్తున్న అటువంటి వెంకట్ నీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు .అలాగే జనరల్ సెక్రటరీ గా లక్ష్మణ్ .క్యాసియర్ గా రవి ని ఎన్నుకున్నారు . నూతన అధ్యక్షుడు వెంకట్ మాట్లాడుతూ సభ్యులకు ఇచిన హామీలు నెరవేరుస్తా అని. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఫ్రీ బస్సు సర్వీసులకు గిరాకి లేక అప్పుల పాలైన డ్రైవర్లు ఎవరు కూడా చింత పడకూడదని .త్వరలో మనకు మంచి రోజులు వస్తాయని. ప్రభుత్వం మనకు ఇచ్చిన హామీ ల కోసం కోట్లాడుతూ మన సభ్యుల అందరికి అండగా ఉంటానని నూతన అధ్యక్షుడు వెంకట్ తెలిపాడు .ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు జనరల్ సెక్రటరీ లు యూనియన్ పెద్దలు పాల్గొన్నారు .
