
జనం న్యూస్ నవంబర్ 7 నడిగూడెం
స్థానిక సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 11వ జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ లో భాగంగా క్రీడలు కొనసాగుతున్నాయి.సూర్యాపేట, నల్లగొండ జిల్లాల నుండి 9 పాఠశాలల విద్యార్థులు క్రీడల్లో పాల్గొన్నారు. కబడ్డీ, వాలీబాల్, కోకో, పరుగుపందెం, లాంగ్ జంప్ తదితర క్రీడలు పోటాపోటీగా జరిగాయి. నడిగూడెం, మఠంపల్లి, నకిరేకల్, డిండి, కొండమల్లేపల్లి, సూర్యాపేట, నిడమనూరు, జీవి గూడెం, కట్టంగూర్ విద్యార్థుల మధ్య పోటాపోటీగా పోటీ జరిగింది. ఆయా పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు పోటీలను నిర్వహించారు. డి సి ఓ, సిహెచ్.పద్మ క్రీడలను పరిశీలించారు. విద్యార్థులు క్రీడలను నైపుణ్యాలను ప్రదర్శించడం పట్ల అభినందించారు. పలు క్రీడల్లో విజయాలను సాధించిన వారిని అభినందిస్తూ రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిలో కూడా రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చింతలపాటి వాణి, పలు పాఠశాలల ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.