
జనం న్యూస్ నవంబర్ 07
మునగాల మండలంలోని మునగాల,రేపాల గ్రామంలో వున్నా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరైన వసతులు లేక రోగులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు అన్నారు.శుక్రవారం స్థానిక మునగాల,రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు.ఈ సర్వేలో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయని వారు తెలిపారు. రేపాల,మునగాల మండల కేంద్రంలో ఉండేటటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సరైన వసతులు లేవన్నారు.రోగులకు మంచినీరు కూర్చోటానికి కుర్చీలు సరైన మందులు లేక ఇబ్బంది పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్లు మండల కేంద్రంలో నూతన భవనం నిర్మించుకున్నప్పటికీ ఆ భవనంలో సరైన వసతులు లేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు.మునగాల హాస్పిటల్లో 10 పోస్టులు ఖాళీ ఉన్నప్పటికీ,వాటిని భర్తీ చేయలేదని వాటిని వెంటనే భర్తీ చెయ్యాలని డిమాండ్ చేశారు.రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక్కరే డాక్టర్ ఉండటం వల్ల రోగులకు సరైన వైద్యం అందట్లేదని అన్నారు. కాళీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ వైద్యం మరింత ఫిరమైందని వారు అన్నారు.రోగులకు రక్త పరీక్ష చేసేందుకు సరైన పరికరాలు లేక సూర్యాపేటకు తరలిస్తున్నారని వారు అన్నారు. మునగాల మండలంలో జాతీయ రహదారి ప్రక్కన ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గతంలో పోస్టుమార్టం సెంటర్ ఉన్నప్పటికీ ఆ సెంటర్ ను తొలగించడం సరైన కాదని వారన్నారు.వెంటనే పోస్టుమార్టం కేంద్రాలను పునర్దించాలని డిమాండ్ చేశారు.ఈ సర్వే కార్యక్రమంలో వ్యవసాయకార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సోమపంగు జానయ్య, అరె రామకృష్ణారెడ్డి,మండల నాయకులు కిన్నెర వెంకన్న,గడ్డ వెంకన్న,లక్ష్మయ్య,తదితరులు పాల్గొన్నారు.