
జనం న్యూస్ ; నవంబర్ 8 శనివారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;
నవంబర్ 9వ తేదీన ఉదయం పది గంటలకు సిద్దిపేటలోని హరిహర రెసిడెన్సి సమీపంలో గల లలిత చంద్రమౌళీశ్వర క్షేత్రం మాస ఉత్సవాలను పురస్కరించుకొని పూజలు, హోమాలు, వైధిక కార్యక్రమాలతో పాటు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే అష్టావధాన కార్యక్రమం కలదని నిర్వాకులు పండరి రాధాకృష్ణ తెలిపారు అష్టావధానంను అవధాని డాక్టర్ గౌరిభట్ల రఘురామశర్మచే నిర్వహించడం జరుగుతుందన్నారు. అష్టావధానంలో పృచ్చకులుగా నిషిద్ధక్షరికి సింగీతం నరసింహారావు, దత్తపదికి నల్ల అశోక్, న్యస్తాక్షరికి వేలేటి శైలజ, వర్ణనకు ఉండ్రాళ్ళ రాజేశం, అశువుకు కట్టా రంజిత్ కుమార్, అప్రస్తుతంకు రాచర్ల వేణుమాధవశర్మ, సమస్యకు ఉస్మాన్, అంత్యాక్షరి వరుకోలు లక్ష్మయ్య తదితరులు పాల్గొంటారని, ఇట్టి అష్టావధాన కార్యక్రమానికి కవులు, రచయితలు, సాహితీ ప్రియులు హాజరై విజయవంతం చేయాలన్నారు.