
జనం న్యూస్ నవంబర్ 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం ఎన్ని అవరోధాలు ఎదురైనా తాను ఎంచుకున్న లక్ష్యం కోసం జెడ్పిటిసి స్థాయి నుండి సీఎం పీఠాన్ని అధిరోహించిన లక్ష్యసాదకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. శనివారం సీఎం జన్మదిన సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కమిటీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతిపక్షాలు ప్రభుత్వం కూలిపోవాలని ఎన్ని కుట్రలు చేసినా, సీనియర్ లు అయిన తన సహచర మంత్రులకు స్వేచ్చనిచ్చి, సమన్వయం చేసుకుంటూ రెండేళ్లుగా పాలన కొనసాగిస్తూ ప్రజల మన్నలను పొందుతున్నారు అన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులలో ఉన్న రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఏకకాలంలో 2 వేల కోట్ల రుణమాఫీ చేశారని, వరి వేస్తే ఉరే… అన్న గత ప్రభుత్వ ప్రకటనలను పక్కనపెట్టి, వరి పండించిన రైతులకు 500 బోనస్ తో సహా చెల్లించిన ఘనత కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు. క్రమక్రమంగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఓ పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమానికి పాటుపడుతున్న ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ రాష్ట్రానికి మరో 10 ఏళ్లు సేవలందించాలని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పరకాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మారెపల్లి (బుజ్జన్న) రవీందర్ మండల యూత్ అధ్యక్షుడు సాదు నాగరాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు చల్ల చక్రపాణి పోలపల్లి శ్రీనివాస్ రెడ్డి మారెపల్లి వైనాల కుమారస్వామి దుబాసి కృష్ణమూర్తి రఘుపతి రెడ్డి నిమ్మల రమేష్ మామిడిపల్లి సాంబయ్య వీరన్న రాజు చిరంజీవి పైడి కుమారస్వామి మధుసూదన్ వరదరాజు సుధాకర్ రెడ్డి పత్తి శీను సుకుమార్ తారాపూర్ మాజీ సర్పంచ్ రేణికుంట్ల సదయ్య రవి రమేష్ రజనీకాంత్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు….