
జనం న్యూస్ నవంబర్ 08 జగిత్యాల:
పేద ప్రజలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తుందని ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ గ్రామానికి చెందిన పడాల రాజశేఖర్‌కు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.24 వేల చెక్కును శనివారం ఆయన స్వగృహంలో బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ అంజిరెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ, “పేదల అభివృద్ధి, సంక్షేమమే మా ప్రభుత్వం లక్ష్యం. ప్రతి అవసరంలో ప్రజలకు అండగా నిలబడటమే సీఎం సహాయనిధి ఉద్దేశ్యం” అని తెలిపారు.