
జనం న్యూస్ 10 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
నిన్న విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులు,జడ్పీ చైర్మన్,భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) మరియు వారి కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ భీమిలి నియోజవర్గం ఆనందపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరగబోయే "వైయస్సార్సీపీ ప్రజా ఉద్యమం" కార్యక్రమంలో భాగంగా భీమిలి నియోజకవర్గ సమావేశం నిర్వహించి నాయకులతో చర్చించి కార్యచరణ దిశా నిర్దేశం చేశారు . అనంతరం "ప్రజా ఉద్యమం" పోస్టరు ఆవిష్కరణ చేశారు..ఈ సమావేశంలో చిన్న శ్రీను మాట్లాడుతూ..విద్య , వైద్యం ప్రజల కనీస హక్కు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వీటిని ప్రజలకు దూరం చేస్తోంది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 12వ తేదీన పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాం అని అన్నారు..దీనికి సంబంధించి కోటి సంతకాల సేకరణ ఇప్పటికే మొదలయ్యింది , ప్రజలలో భారీ స్పందన వచ్చింది మాజీ సీఎం వైయస్ జగన్ నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గేదాకా వైయస్సార్సీపీ పోరాడుతుందని, కలిసి వచ్చే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు,మేధావులతో కలిసి ఉద్యమిస్తామ..మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల12న భీమిలి నియోజకవర్గం తగరపువలస ఫుట్బాల్ గ్రౌండ్ నుంచి భీమిలి ఆర్డిఓ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్ననట్టు తెలియజేశారు..ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు. ఇది రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించిన అంశం. అందరూ చేయిచేయీ కలపాల్సిన అవసరం ఉంది. అన్ని వర్గాల ప్రజలను, అన్ని రాజకీయ పార్టీలను, అన్ని ప్రజా సంఘాలను, ఉద్యమ నాయకులను ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో…భీమిలి నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు,భీమిలి నియోజవర్గ వార్డు అధ్యక్షులు, కార్పొరేటర్లు,రాష్ట్ర,జిల్లా,నియోజకవర్గ అనుబంధ విభాగాల సభ్యులు,మండల మరియు వార్డు కమిటీ సభ్యులు ,మహిళా ప్రజా ప్రతినిధులు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.