
జనం న్యూస్ 10 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
పార్వతిపురం మన్యం జిల్లా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కళాశాగా పనిచేస్తున్న రెడ్డి రమేష్ నాటు బాంబు పేలుడులో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, గౌరవ విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులు,జడ్పీ చైర్మన్,భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) కి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన శ్రీనివాస్‌రావు, తన కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ చేతుల మీదుగా బాధిత రమేష్‌కు ఆదివారం ₹50,000 ఆర్థిక సాయం అందించారు.ఆర్థిక సహాయం కార్యక్రమం మన్యం జిల్లా డాక్టర్ రామ్మోహన్ నాయుడు హాస్పిటల్లో జరిగింది. ఈ సందర్భంగా సిరమ్మ మాట్లాడుతూ, రమేష్ పరిస్థితి చూసి ఎంతో చలించిపోయానని, అతనికి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని వైద్యులకు సూచించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు స్థానిక ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోట వాసు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.