
జనం న్యూస్ నవంబర్ 10 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
కూకట్పల్లి బజరంగ్ టీం సభ్యుల ఆధ్వర్యంలో లక్ష రూపాయల విలువ చేసే సౌండ్ సిస్టమ్ మైక్ సెట్ సామగ్రిని కూకట్ పల్లి అయ్యప్ప స్వామి ఆలయానికి అందజేశారు. ఈ సందర్భంగా మొదటి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి, అయ్యప్ప స్వామి ఆలయ చైర్మన్ వడ్డేపల్లి రాజేశ్వరరావు గురుస్వామి కరకమలములచే సౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించడం జరిగింది.అయ్యప్ప స్వామి ఆలయం భక్తి, నియమం, నియమాచరణకు ప్రతీక. భక్తుల సౌకర్యార్థం ఆధునిక సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం ఆనందదాయకం. భక్తులు భక్తిశ్రద్ధాలతో స్వామి సేవలో పాల్గొని ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్నాను అని రాజేశ్వరరావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు అవినాష్ రావు, అరుణ్ రావు, రామ్మోహన్ రావు, కార్తీక్ రావు, భాను, నరేష్, పవన్, ప్రశాంత్, భారత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
