
జనం న్యూస్ ; నవంబర్ 10 సోమవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;హైదరాబాద్:
సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఘనంగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా మహిళా కన్వీనర్ శ్రీమతి వీరమల్ల రమశ్రీ కో-కన్వీనర్ మ్యాన సౌజన్య ఆర్టిఐ కమిషనర్ శ్రీ దేశాల భూపాల్ ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమానికి ఆర్.టి.ఐ సాధన కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు చంటి ముదిరాజ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సూర స్రవంతి జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకటేష్ గౌడ్ రాష్ట్ర అధికార ప్రతినిధి కాశి సతీష్ కుమార్ , రాష్ట్ర నాయకులు ప్రకాశ్ పటేల్ తదితరులు హాజరయ్యారు.