
జనం న్యూస్ నవంబర్ 10 సంగారెడ్డి జిల్లా
ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు మరింత చురుకుగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య సూచించారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డిఆర్ఓ పద్మజ రాణిలతో కలిసి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజలు తమ వినతులు, ఫిర్యాదులు సమర్పించారు.ప్రజల సమస్యలను శ్రద్ధగా విన్న కలెక్టర్ సంబంధిత శాఖాధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.కలెక్టర్ మాట్లాడుతూ… ప్రజలు సమర్పించిన దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించి, పరిధిలో పరిష్కరించగలిగిన వాటిని వెంటనే పరిష్కరించాలి. పరిధికి సంబంధించినవి కాని అంశాలపై దరఖాస్తుదారు లకు సరైన సూచనలు అందించాలి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో మొత్తం 31 దరఖాస్తులు స్వీకరించబడ్డాయని, వాటిని సంబంధిత శాఖలకు పంపించినట్లు కలెక్టర్ వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈ ఓ జానకి రెడ్డి, పి డి, డి ఆర్ డి ఓ జ్యోతి, రెవెన్యూ, పోలీస్,పంచాయతీ రాజ్, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, సంక్షేమ శాఖల అధికారులు తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.