
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ నవంబర్ 10
ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ధనసిరి గ్రామంలో ఇండ్ల పనులు వేగంగా కొనసాగుతున్నాయి
జహీరాబాద్ నియోజకవర్గం మొగడంపల్లి మండలంలోని ధనసిరి గ్రామంలో ఇందిరమ్మ హౌసింగ్ పథకం కింద 58 మందికి మంజూరి అవగ అందులో 46 మంది ఇండ్లను ప్రారంభించారు ప్రస్తుతం ఈ ఇండ్లు గ్రౌండ్ లెవెల్ వరకు పూర్తయ్యాయి.46మంది లో 15RCC లెవెల్ 05బేస్మెట్ లెవెల్ 26roop లెవెల్లో పనులు జరుగుచున్నాయి ఎంపీడీవో మరియు హౌసింగ్ ఏఈ గ్రామ కార్యదర్శి నాగభూషణంసమక్షంలో పనులు వేగంగా జరుగుతున్నాయి. అధికారులు పనుల నాణ్యతను పరిశీలిస్తూ, నిర్దేశిత సమయంలో ఇండ్ల నిర్మాణం పూర్తిచేయాలని సూచనలు జారీ చేశారు. స్థానిక ప్రజలు ఇంద్రమ్మ పథకం ద్వారా తమ సొంత ఇల్లు కల నిజమవుతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.