
జనం న్యూస్ నవంబర్ 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం అవినీతి లేని భూపాలపల్లి నియోజకవర్గంలో అని మండలాలు తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పని చేస్తున్నారని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జన్మదినం సందర్భంగా మండల కేంద్రంలోని బస్ స్టాప్ వద్ద కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ క్రమంలో బాణసంచా కాలుస్తూ.. కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండల ప్రజల తరుపున ఎమ్మెల్యే జీఎస్సార్ కి శుభాకాంక్షలు తెలయజేశారు పదవి ఉన్న లేకున్నా భూపాలపల్లి నియోజకవర్గ ప్రజల కష్టసుఖాలలో పాలు పంచుకుంటూ ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేసి..రెండు పర్యాయాలు ఓటమి చెందినా మొక్కవోని ధైర్యంతో పోరాడి మూడోసారి అధికారంలోకి వచ్చి, విద్య, వైద్యం ప్రధాన ఎజెండా గా పనిచేస్తూ భూపాలపల్లి ని అభివృద్ధి చేస్తున్నారన్నారు. ప్రజాసేవే వ్యాపారం గా ఎంచుకుని భూపాపల్లి ప్రజల సంక్షేమ కోసం పాటుపడుతున్న ఎమ్మెల్యే సత్యనారాయణ రావు రాబోయే రోజుల్లో ప్రజా ఆశీర్వాద బలంతో నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు చక్రపాణి శ్రీనివాస్ రెడ్డి బుజ్జన్న మైనాల కుమారస్వామి చిందం రవి రఘుపతి రెడ్డి దుబాసి కృష్ణమూర్తి ప్రకాష్ రెడ్డి మామిడిపల్లి సాంబయ్య నిమ్మల రమేష్ శానం కుమారస్వామి హైదర్ రాజకుమార్ శంకర్ హింగే భాస్కర్ సుధాకర్ భాస్కర్ శ్రీనివాస్ రమేష్ రజినీకాంత్ చిరంజీవి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు…..