
జనం న్యూస్ నవంబర్ 10 అమలాపురం
ఉప్పలగుప్తం మండలం విలసవిల్లి గ్రామములో చేనేత కులానికి
చెందిన (దేవాంగ, కర్నబత్తుల, పద్మశాలీ) కులాలకు సర్వే నెం.166/28 లో వీవర్స్ సొసైటీ బిల్డింగ్ నిర్మాణం కొరకు గత జగనన్న ప్రభుత్వములో ఈ చేనేత సొసైటీ బిల్డింగ్ నిర్మించడానికి సర్పంచ్ ఊర్మిళాదేవి సతీష్ దంపతులు చాలా కృషి చేయటంతో చేనేత కార్మికులు ఊర్మిళాదేవిని ఘనంగా సన్మానించారు. ఈ బిల్డింగ్ నిర్మించే స్థలం గ్రామ కంఠం భూమిగా ఉండుటచేత అప్పుడు నూతన బిల్డింగ్ నిర్మించడానికి రెవిన్యూ అధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతో గ్రామ సర్పంచ్ ఊర్మిళాదేవి సతీష్ గారు గ్రామ,
మండల, జిల్లా రెవిన్యూ అధికారులను కలిసి ఈ సమస్యను పరిష్కరించి ఈ స్థలములో బిల్డింగ్
నిర్మాణం జరగడానికి చాలా పాటు పడ్డారని అభినందనలు తెలిపారు. అదేవిధంగా ఈ మద్యకాలంలో నూతన
చేనేత సొసైటీ బిల్డింగ్ పనులు ప్రారంభించిన కార్యక్రమంలో సర్పంచ్ కూడా పాల్గొని అభివృద్ధికి సహకరించినప్పటికీ గ్రామంలో అభివృద్ధిని వార్వలేని కొంతమంది వ్యక్తులు ఈ విషయంలో బురద చల్లాలని చూసారని, అటువంటి ఏమి పట్టించుకోవద్దని కోరారు. సర్పంచి దంపతులు మా చేనేత కార్మికులకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను మేము ఎన్నటికీ మర్చిపోలేమనీ, గ్రామాల్లో సంస్కరణ లేని వ్యక్తుల మాటలు పట్టించుకోవద్దని కోరుతూ ఈ చేనేత సొసైటీ భవన నిర్మాణానికి, పంచాయితీ నుండి అనుమతులు యిప్పించవలసినదిగా వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో వైసిపి గ్రామ కమిటి అధ్యక్షులు సలాది సతీష్, బళ్ళ నాగ సతీష్, ' ఆశపు వీరభద్రరావు, 'తాళ్ళ మల్లిఖార్జున రావు, కారుపర్తి గిరిజాపతి, కాశిన అప్పారావు ( కడి) సూర్యప్రకాశరావు, పప్పు రామన్న', గుమ్మడి నీలకంటేశ్వరావు, పుత్సల చిన వెంకటేశ్వరావు, గంపల పల్లపు సుబ్బారావు, బళ్ళ సత్యనారాయణ, పప్పు బాల శివ శంకర రావు తదితర చేనేత సోదరులు పాల్గొన్నారు.

