జనం న్యూస్ 01 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జిల్లా పోలీసుశాఖలో స్నిఫర్ డాగ్‌గా విశేషమైన సేవలందించి, మృతి చెందిన పోలీసు డాగ్ 'వీనా'కు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. 2014 సం.లో ఫిమేల్ స్నిఫర్ డాగ్‌గా 'వీనా' ఇంటిలిజెన్సు విభాగంలో శిక్షణ పూర్తి చేసుకొని జిల్లాకు వచ్చినట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. తన చివరి శ్వాస వరకు జిల్లా పోలీసుశాఖకు సేవలందించిందన్నారు.