
రుచి కోసం కాదు ఆరోగ్యం కోసం ఆహారం తీసుకోవాలి
జనం న్యూస్ నవంబర్ 11 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో సోమవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా నర్సాపూర్ ప్రాజెక్టు పరిధిలోని చిలిపి చెడు మండల కేంద్రమైన హై స్కూల్ ప్రాంగణంలో పోషణ మాసం ఉత్సవం మరియు బాల్య వివాహ నిషేధ చట్టం అవగాహన కార్యక్రమం జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరై ప్రతి వ్యక్తి రుచి కోసం కాదు ఆరోగ్యం కోసం అన్ని రకాల ఆహార పదార్థాలు తినాలని ముఖ్యంగా స్థానికంగా దొరికే ఆకుకూరలని తిని ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా తెలిపారు మరియు ప్రతి ఆడపిల్లలను చదివించి ఉన్నత స్థాయికి ఎదిగేలా చూడాలని మరియు చదువులు చదివించి వారికి ఉద్యోగాలు వచ్చిన తర్వాత పెళ్లిళ్లు చేస్తే రాబోయే కాలంలో మంచి ఆరోగ్యవంతమైన సమాజానికి తయారు చేసుకోవచ్చు ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటుచేసిన న్యూట్రిషన్ స్టాల్ అన్నింటినీ చూసి అభినందించారు అనంతరం పోషణ అభియాన్ కార్యక్రమంలో ఉత్తమ అంగన్వాడి టీచర్లకు ఆశ వర్కర్లకు మరియు ఏటీఎం సిఏ సిసి పంచాయతీ కార్యదర్శులకు ఏఎన్ఎం మెడికల్ ఆఫీసర్ హెల్త్ సూపర్వైజర్ పారిశుద్ధ్య కార్మికులకు ప్రశంసా పత్రాలను అందించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్ మెడికల్ ఆఫీసర్ శ్రీకాంత్ స్థానిక ఎస్సై నర్సింలు ఆర్ ఐ సునీల్ సింగ్ ఎంపీ ఓ తిరుపతి ఏపీఎం గౌరీ శంకర్ ఐ సి డి ఎస్ సూపర్వైజర్ సంతోషిమాత మరియు ఎన్జీవో సునీత సంతోష చీటీ గంగమని సఖి సెంటర్ ఆఫీసర్ నిర్మల అంగన్వాడి టీచర్స్ సీసీలు ఆశా వర్కర్లు ఐసిపిఎస్ సిబ్బంది పిల్లల యొక్క తల్లులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తదనంతరం స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అర్హులైన నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు