
జనం న్యూస్ నవంబర్ 11 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
శ్రీ భక్తాంజనేయ దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాసం మూడో మంగళవారం సందర్భంగా ప్రతి ఏడాది నిర్వహించినట్లే ఈ సంవత్సరం సుమారు 8000 మంది భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు భక్తులకు అన్నప్రసాదాన్ని ప్రారంభించారని దేవస్థానం ట్రస్ట్ పొలిమేర నాయుడు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ నాగ జగదీష్ మాట్లాడుతూ శ్రీ భక్తాంజనేయ దేవస్థానం వారు కీర్తిశేషులు పొలిమేర సింహాచలం నుండి వారి కుమారుడు అప్పారావు వారి కుమారుడు నాయుడు బ్రదర్స్ 40 సంవత్సరాలు నుండి అన్న సమారాధన వారి సొంత నిధులతో పాటు భక్తులు సహకారంతో నిర్వహించడం వారి మొత్తం కుటుంబ సేవా కార్యక్రమంలో పాల్గొనడం అందరికీ ఆదర్శప్రాయమని ఈ అన్న సమారాధనలో పాల్గొన్న భక్తులకు క్రమశిక్షణతో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కమిటీ వారు ఏర్పాటు చేయడం హర్షనీయమని నాయుడు బ్రదర్స్ కి నాగ జగదీష్ అభినందనలు తెలియజేశారు.