జనం న్యూస్ 01 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
గత కొద్ది రోజుల క్రితం నుండి 30 12-2024 నుండి పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ జరుగుచున్నవి. ఇందులో భాగంగా మన విజయనగరం డిఫెన్స్ అండ్ పోలీస్ అకాడమీ విద్యార్థిని విద్యార్థులు? ఇందులో బాలికల సంఖ్య 14, బాలురు సంఖ్య 31. పాల్గొన్నారు…
గర్ల్స్ :- 14 మందికి 09 మంది ఈవెంట్ కంప్లీట్ చేసినారు.
ఓవర్ ఏజ్ -01
హైట్ -02
రన్నింగ్ -02
బాయ్స్:- 31 మందికి 27 మంది ఈవెంట్ కంప్లీట్ చేసినవారు..
నాట్ అటెండ్ -01
హైట్ -02
చెస్ట్ (బ్రీతింగ్ ఎక్స్టెన్షన్) -01
బాలికలు బాలురు కలిపి మన గ్రౌండ్ నుండి 35 మంది తుది రాత పరీక్షకు హాజరుకానన్నారు.. డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ అనిల్ కుమార్ ఎక్స్ ఎన్ ఎస్ జి కమాండో ఆయన మాట్లాడుతూ 6,100 కానిస్టేబుల్ పోస్టులకు పిలిమినరీ రాత పరీక్షలో 92,000 మంది PMT కి సెలక్ట్ కాగా ఇందులో 69 వేల మంది హాజరు కాగా బాల బాలికలు 39 మంది PMT కంప్లీట్ చేసుకుని తుది రాత పరీక్షకు హాజరుకానన్నారు.
తుదిరాత పరీక్షకు వెళ్ళిన వారికి ముఖ్యంగా చెప్పబోయేది ఏమిటంటే. ఈ పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ లో అందరూ కష్టపడ్డారు. కొంతమందికి మంచి మార్కులు వచ్చాయి, మరి కొంతమందికి అనుకున్నమార్కులు రాలేకపోయాయి. ఆ గ్రౌండ్ మార్కులు రాలేని వారు! దానికి మీరు ఎవరు కూడా భయపడవద్దు, బాధపడవద్దు. ఈవెంట్ వేసిన రోజు మీది కానప్పుడు దానికి భగవంతుడు కూడా ఏమి చేయలేడు. ఇది నిజం… తుది రాత పరీక్షలో మీరు ఏంటి అన్నది ప్రూవ్ చేసుకోండి…. ఒక దగ్గర ఆ భగవంతుడు మనకు ఇవ్వలేదు అనుకుంటే ఇంకో దగ్గర తప్పకుండా దారి చూపిస్తాడు. మీరు పడ్డ కష్టం తప్పకుండా మిమ్మల్ని వరిస్తుంది.
(సాధించాలనే తపన ఉంటే చాలదు. దానికి తగ్గ కృషి ఉండాలి. నిరంతర సాధన చెయ్యాలి.అప్పుడే మనం దేన్నైనా సాధించగలము.)అందుకోసం మీరు ఈ టైంలో అక్కడ మాటలు ఇక్కడ మాటలు విని మీ మైండ్ పాడు చేసుకోకండి, మీ టైం వేస్ట్ చేసుకోకండి. ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారో వాళ్లకి సమాధానం చెప్పే రోజు మీ చేతిలోనే ఉంది. నేను ఒక కోచ్ గా చెప్పడం లేదు! మీకు మీ అన్నయ్యగా నేను చెప్తున్నాను..
పైకి రావాలనే తపన ఉంటే సరిపోదు. దానికి తగ్గ కృషి ఉండాలి. Time అంతే. Time అనేది ఉన్నప్పుడు Use చేయకపోతే ఆ తర్వాత తిరిగి రమ్మన్నా రాదు.మీరు పడుకునే బెడ్ పరుపు -మిమ్మల్ని అసహ్యించుకునే ముందే బద్దకాన్ని వదిలేయ్. సూర్యోదయం అవ్వకముందు ఎవరైతే నిద్ర లేచి చదువుతారో వారు జీవితంలో అనుకున్నది కచ్చితంగా సాధిస్తారు. మీ జీవితానికి మీరే హీరో. 💯మీ నుండి నేను ఎప్పుడూ ఏమి ఆశించను మంచి జాబ్ కొట్టాలి కొందరైనా నావలన మంచి స్ధాయిలో ఉండాలి అనేదే నా కోరిక , కనుక ఎవరు నాకోసం ఎంత తప్పుగా చెప్తున్నా ఎన్ని మాటలు మాట్లాడుకుంటున్నా అవన్నీ మీ కోసం మీ ఫ్యూచర్ కోసం పట్టించుకోకుండా వదిలేసాను, ఆ పేరు మీరు నిలబెట్టాలి ,నేను మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలి.
రేపు అన్నది మనది కాదు !!! ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు అన్నది, నువ్వు ఎంత మంచిగున్నావో అన్నది కావాలి. పంతాలు పట్టింపులకి దయచేసి పోకండి. అవి ఎక్కడ చూపించాలో అక్కడ చూపిస్తేనే మీరు అనుకున్న మీరు అనుకున్న పంతాలకి పట్టింపులకు విలువ ఉంటుంది. అంతేగాని జీవితాంతం పంతాలు పట్టింపులతో ఉండద్దు తెల్లవారి లెగిస్తే పలకరించుకునేలా ఉండండి..