
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు మండలంలోని ప్రధాన వీధులు,కాలనీలలో రోడ్లమీదుగా వదిలేయబడిన ఇంటర్నెట్ కేబుల్లు మరియు టెలి కమ్యూనికేషన్ కేబుల్ జాయింట్ బాక్సులు ప్రజలకు ఇబ్బందులతో పాటు భయాందోళనలను కలిగి స్తున్నాయి. కేబుల్లలో కరెంట్ ప్రవహిస్తుందో లేదో తెలియక వాహనదారులు, పాదచారులు ఆందోళన చెందుతున్నారు.ప్రజలు చెబుతూ ఈ కేబుల్లు రోడ్డంతా అడ్డంగా పడి ఉన్నాయి అని.వర్షం పడినప్పుడు మరింత ప్రమాద కరంగా మారే అవకాశం ఉందని. పిల్లలు,వృద్ధులు బయటకు వెళ్లడం కూడా భయంగా మారింది అని ఆవేదన వ్యక్తం చేశారు. స్థాని కులు పంచాయతీఅధికారులు ,సంబంధిత ఇంటర్నెట్ కంపెనీలు వెంటనే చర్యలు తీసుకొని కేబుల్లను తొలగించి సురక్షితంగా ఉండే చోట అమర్చాలని,రోడ్లను పరిశుభ్రంగా ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు
