
జనం న్యూస్ నవంబర్ 11 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన
ప్రతి ఒక్కరు స్వదేశీ వస్తువులనే వాడాలని, విదేశీ వస్తువులపై మోజు తగ్గించుకోవాలని బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి సూర్యనారాయణ గుప్త ( నానాజీ) పేర్కొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని తెలియపరచవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు.మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల పరిధిలోని కందికుప్ప పంచాయతీ గోపాలరావుపేట, పల్లం ,తదితర ప్రాంతాల్లో విస్తృతంగా ఇంటింటికి ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు మట్ట సూరిబాబు, మల్లాడి అనిల్ కుమార్, పాలెపు రామకృష్ణ, మల్లాడి బాపూజీ దాస్ తదితరులు పాల్గొన్నారు.

