
జనం న్యూస్ 11 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
జోగులాంబ గద్వాల్ జిల్లా: ఆన్ లైన్ బెట్టింగ్ లకు బానిసై,అక్రమ మార్గాన డబ్బులు సంపాదించాలనే అత్యాసతో ఓ మహిళను హత్య చేసి, బంగారు పుస్తెలతాడు, ఆభరణాలు,పట్టీలు, కడాలు, ఎత్తుకెళ్లిన కేసులో ప్రధాన నిందుతుడ్ని గద్వాల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.నిందితుడ్ని నుంచి రూ.2,35,000, ఒక వాహనం, ఐపోన్ స్వాధీనం చేసుకున్నారు.గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శేరెల్లివీధిలో బలిజ లక్ష్మీ (55)హత్య కేసులో ప్రధాన నిందితుడు రాంరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ టి.శ్రీనివాస్ రావు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల ఏఎస్పీ శంకర్, డీఎస్పి వై మొగులయ్య,గద్వాల సీఐ టి.శ్రీను, గద్వాల రూరల్ ఎస్ఐ శ్రీకాంత్, మల్దకల్ ఎస్ఐ నందీకర్, ధరూర్ ఎస్ఐ శ్రీహరి , గద్వాల టౌన్ 2 ఎసై సతీష్ రెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.