
జనం న్యూస్ నవంబర్ 11 మునగాల
జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు మునగాల మండల పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. మునగాల సర్కిల్ సీఐ రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు,మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో, మునగాల మండలం ఆకుపాముల వై జంక్షన్ వద్ద వాహనాల వేగాన్ని నియంత్రించడానికి బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీనివల్ల జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలు వేగం తగ్గించి ప్రయాణిస్తున్నాయి.పోలీసుల ఈ చర్యల పట్ల వాహనదారులు, పాదాచారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.