
108 సిబ్బంది అభినందించిన గ్రామస్తులు
జనం న్యూస్ - నవంబర్ 12- నాగార్జునసాగర్ రిపోర్టర్-
నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం కొంపల్లి గ్రామానికి చెందిన చింతమల్ల సంధ్య (22) గర్భిణీ స్త్రీకి పురిటి నొప్పులు రాగా108 ఫోన్ చేయగా విషయం తెలుసుకున్న 108 సిబ్బంది సకాలంలో స్పందించి మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో పురిటి నొప్పులు అధికం కావడంతో 108 సిబ్బంది ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ ఫిజీషియన్ డాక్టర్ శివ ను ఫోన్లో సంప్రదించి ఆయన సూచనల మేరకు సంధ్య కు సాధారణ ప్రసవం చేసి అనంతరం మెరుగైన సేవల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తక్షణమే స్పందించి సకాలంలో వైద్య సేవలు అందించిన 108 సిబ్బంది (ఈఎంటి) రాకేష్,( పైలట్) గణేష్ లను ఆసుపత్రి సిబ్బంది, సంధ్య కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు. ఈ సందర్భంగా 108 సిబ్బంది మాట్లాడుతూ బాధితుల నుంచి ఫోన్ కాల్ అందుకున్న వెంటనే తాము తక్షణ సాయం అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ప్రజలందరూ అత్యవసర సమయంలో 108 కి కాల్ చేసి తమ వివరాలను తెలియజేసి 108 సేవలను వినియోగించుకోవాలని కోరారు.