
జనం న్యూస్ 12 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగబోయే CII 30వ భాగస్వామ్య సదస్సు రాష్ట్రానికి మేలు చేయనుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విశాఖలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 45 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు, 30 మంది విదేశీ మంత్రులు పాల్గొననున్నారని చెప్పారు. మొత్తం 410 ఒప్పందాల ద్వారా రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందన్నారు.